Wednesday, October 16, 2019
Follow Us on :

ఆస్ట్రేలియాతో వన్డేకు టీమ్ ఎంపిక

By BhaaratToday | Published On Feb 15th, 2019

ఈనెల 24 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ 15మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్‌ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. ‘కాఫీ విత్ కరణ్‌’ వివాదం తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమైన కేఎల్‌ రాహుల్‌కు కూడా ఈ జట్టులో స్థానం లభించింది. కివీస్‌తో ఆడిన దినేశ్‌ కార్తిక్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. విశాఖపట్నం వేదికగా తొలుత టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తర్వాత ఐదు వన్డేల సిరీస్‌ జరుగుతుంది.  విరాట్‌ కోహ్లీ(సారథి), రోహిత్‌ శర్మ(వైస్ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, ఎంఎస్‌ ధోనీ(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, విజయ్‌ శంకర్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌యాదవ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, మయాంక్‌ మార్కండే జట్టులో ఉన్నారు.
తొలి రెండు వన్డేలకు విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, ధోనీ(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, జస్ర్పీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్ యాదవ్‌, విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేఎల్‌ రాహుల్ ను ఎంపిక చేశారు. మిగతా వన్డేలకు  విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, ధోనీ, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లను సెలక్ట్ చేశారు.