Monday, November 18, 2019
Follow Us on :

కొనసాగుతున్న బంద్.. ఈరోజు సాయంత్రం ఏమి చేయబోతున్నామో చెప్తాం

By BhaaratToday | Published On Oct 19th, 2019

 తెలంగాణ బంద్ ఉదృతమవుతోంది. పలు యూనియన్లు బంద్ లలో పాల్గొంటున్నాయి. కొన్ని చోట్ల బస్సులను బయటకు తీయాలని తాత్కాలిక ఉద్యోగులు ప్రయత్నించగా వారిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లను కొట్టారు. హైదరాబాద్ లో పలు చోట్ల రాస్తారోకో నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాబ్ లూ, ఆటోలు కూడా పెద్దగా రోడ్ల మీద కనిపించడం లేదు. 

ఆందోళన చేస్తున్న నేతల అరెస్టులపై టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

కార్మిక సంఘాలతో చర్చలు మొదలుపెట్టాలని హైకోర్టు చెప్పగా.. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ సమ్మె విరమించమని చెప్పిన ఉద్యోగ సంఘాలు.