Monday, November 18, 2019
Follow Us on :

అసెంబ్లీలో కాంగ్రెస్‌పై ధ్వ‌జ‌మెత్తిన సీఎం కేసీఆర్‌

By BhaaratToday | Published On Feb 23rd, 2019

రెండో రోజు తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ కొన‌సాగుతుంది. బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని, కాంగ్రెస్‌ పార్టీ వల్లే 24 గంటల కరెంట్‌ సాధ్యమైందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఆరాచకం సృష్టిస్తోందని  ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. బడ్జెట్‌లో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదనంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. స్థానిక సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, పంచాయతీల నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదని, వాటి పటిష్టత కోసం కొత్త చట్టం తెచ్చామని అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పాలనపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని దుయ్య‌బ‌ట్టారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ.2కోట్ల బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.