Monday, December 16, 2019
Follow Us on :

తెలంగాణలో లోక్ సభకు 443 మంది అభ్యర్థులు

By BhaaratToday | Published On Apr 11th, 2019

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా నిజామాబాద్ నియోజకవర్గంలో 185 మంది, అత్యల్పంగా మెదక్ పార్లమెంటుకు 10 మంది పోటీ చేస్తున్నారు. మొత్తంగా 25 మంది మహిళలు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను నిలుపగా, ఎంఐఎం ఒక్క స్థానంలో బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. రిజిస్టర్డ్ పార్టీల నుంచి 83 మంది, స్వతంత్రులు 299 మంది బరిలో నిలబడ్డారు.