Tuesday, October 15, 2019
Follow Us on :

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో వింత‌ఘ‌ట‌న‌...అస‌లు విష‌యం తెలిసి షాకైన అభ్య‌ర్థి

By BhaaratToday | Published On Jan 23rd, 2019

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వింతఘటన చోటుచేసుకుంది. మ‌తిమరుపే ఓ అభ్యర్థి కొంపముంచింది. ఒక్క ఓటు తేడాతో అభ్యర్థి గెలుపు సాధించేందుకు తోడ్పడింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి..ప్రచారంలో నిమగ్నమయ్యాడు. తనకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరే పనిలో పడిపోయాడు. చివరకి ఆ అభ్యర్థి, అతని భార్య ఓటు వేయడం మర్చిపోయారు. దీంతో ప్ర‌త్య‌ర్థి ఒక్క ఓటు తేడాతో గెలవడంతో ఆ దంపతులు షాక‌య్యారు. ఆ తర్వాత తాము ఓటు వేయడమే మర్చిపోయామని తెలుసుకుని కంగుతిన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. వినటానికి, చదవడానికి విడ్డురంగా ఉన్న జరగాల్సిందంట జరిగిపోయింది.