Monday, November 18, 2019
Follow Us on :

తెలంగాణ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం

By BhaaratToday | Published On Feb 17th, 2019

కిడ్నీ వ్యాధులతో బాధపడుతుతూ, డయాలసిస్ నిమిత్తం ప్రయాణాలు చేసే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ స్కీమ్ ను అమలు చేస్తామని, రాష్ట్రంలోని  7,600 మందికి పైగా రోగులకు లాభం చేకూరుతుందని సంస్థ ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో వీరు ప్రయాణించవచ్చని, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సులు, డీలక్స్ బస్సులలో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ స్కీమ్ అమలు చేస్తే రూ. 12.22 కోట్ల భారం టీఎస్ఆర్టీసీపై పడుతుందని, దీన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుందని ఆయన వెల్లడించారు.