Tuesday, May 21, 2019
Follow Us on :

తెలంగాణ ఓట‌ర్ల‌ జాబితాలో విచిత్ర‌మైన పేర్లు!

By BhaaratToday | Published On Mar 13th, 2019

సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలో అధికారులు ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఫారం-6తో నమోదైన కొత్త ఓటర్ల పేర్లతో పాటు, మార్పులు చేర్పుల అనంతరం పూర్తిస్థాయిలో జాబితాలు రూపొందిస్తున్నారు. అయితే, ఓటర్ల లిస్టును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మదిరిగిపోయేలా చిత్రవిచిత్ర‌మైన పేర్లు కనిపిస్తున్నాయి. 'బాహుబలి... సన్నాఫ్ చౌగులి' అని ఒక ఓటరు పేరుంటే, మరికొందరు ఓటర్ల పేర్లు ఇడ్లీ అని, యాపిల్ అని ఉన్నాయి. ఇవైతే ఫర్వాలేదు కానీ, మరికొన్ని పేర్లు పూర్తిగా రాయడానికి వీల్లేని భాషలో చిరాకు తెప్పించేలా ఉన్నాయి. ఆ ప‌దాలను వినలేక అధికారులే  చెవులు మూసుకునే పరిస్థితి ఉందట‌. మొత్తమ్మీద విభిన్నంగా కనిపించిన 37 పేర్లును ఓటరు జాబితాల నుంచి తొలగించారు అధికారులు. దీనిపై తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఓట్లు గల్లంతైన వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింద‌ని, ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు గల్లంతైందని ఫిర్యాదు చేశారని అన్నారు. వారితో పాటు మరికొందరు ప్రముఖుల ఓట్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయ‌న‌ వెల్లడించారు.