Tuesday, September 24, 2019
Follow Us on :

పాక్ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ కాల్పులు....తిప్పికొట్టిన భారత సైనికులు

By BhaaratToday | Published On Mar 18th, 2019

పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు జరిగాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు రాజౌరి జిల్లాలో పాక్ సైనికులు మోర్టార్లతో దాడి చేశారు. రాజౌరి జిల్లా సుందర్ బనీ సెక్టారులో పాక్ కాల్పులకు దిగడంతో భారత సైనికులు తిరిగి కాల్పులు జరిపారు. పాక్ సైనికుల దాడిని భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు. భారత ఎదుర్కొవడంతో పాక్ సైనికులు తోకముడిచారు. పుల్వామా దాడి, భారత వాయుసేన పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి ఘటనల అనంతరం పాక్ సైనికులు తరచూ కాల్పులకు దిగుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుసార్లు ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారు. పాక్ దాడిని భారత సైనికులు తిప్పికొట్టి తమదే పైచేయిగా నిలిచారు.