Saturday, August 24, 2019
Follow Us on :

మ‌రోమారు దొంగ‌దెబ్బ తీసిన ఉగ్ర‌వాదులు.. ముగ్గురు జ‌వాన్లు మృతి

By BhaaratToday | Published On Jun 12th, 2019

ఉగ్రవాదులు మరోసారి దొంగదెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కేపీ రోడ్డు వద్ద సీఆర్‌పీఎఫ్ గస్తీ బృందంపై బుధవారం సాయంత్రం దాడికి దిగారు. ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరపుతూ, గ్రనేడ్లు విసిరారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అనంత్‌నాగ్ ఎస్‌హెచ్ఓ హర్షద్ అహ్మద్‌‌ను హుటాహుటిన శ్రీనగర్ తరలించారు. 

బలగాల ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది సైతం హతమవ్వ‌గా.. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. కాగా, అనంత్‌నాగ్ బస్ట్ స్టాంప్ సమీపంలో కేపీ చౌక్ వద్ద 116 బెటాలియన్ గస్తీ తిరుగుతుండగా ఉగ్రవాదులు ఈ కాల్పులకు దిగినట్టు సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడిలా కనిపిస్తోందని పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి.