Friday, December 06, 2019
Follow Us on :

వారికి బీజేపీ ప్రభుత్వమంటే భయం.. అందుకే ఆ సాహసం చేయరు!

By BhaaratToday | Published On Apr 12th, 2019

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులు, నక్సల్స్ బీజేపీ ప్రభుత్వమంటేనే భయపడతారని..  వారు కనీసం మా దగ్గరకు రావడానికి కూడా సాహసించరని.. ఒక వేళ వస్తే చనిపోవడమో లేదా జైలుకెళ్లడమో జరుగుతుందని వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లో పాలన పట్టాలు తప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. దేశంలో కుల, మతవిద్వేషాలు పెరగడానికి.. టెర్రరిజం, నక్సలిజం వల్ల ఇబ్బందులు ఏర్పడటానికి అరవైఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్సే కారణమని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.