Wednesday, October 16, 2019
Follow Us on :

సరిహద్దుల్లో 150కి పైగా ఉగ్రవాదులు

By BhaaratToday | Published On Aug 10th, 2019

భారత్ ను ఎదిరించే దమ్ము పాకిస్థాన్ కు ఎలాగూ లేదు. అందుకే ఉగ్రవాదులను ఎన్నో ఏళ్లుగా భారత్ మీదకు ఉసిగొల్పుతూ మారణహోమం సృష్టిస్తోంది. ఇక జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం పాకిస్థాన్ కు నచ్చడం లేదు. అంతర్జాతీయంగా వివిధ దేశాల సహాయం కోరుతున్నా.. వారు మాత్రం సహకరించలేదు. దీంతో తీవ్రవాదులను భారత్ మీదకు ఉసిగొల్పాలని చూస్తోంది. 

పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుల్లో ఉన్న టెర్రరిస్టులకు పాక్ సైన్యం అండగా ఉంది. సరిహద్దుల్లో 150కి పైగా ఉగ్రవాదులు మకాం వేసినట్టు భరత ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. వీరిలో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ సోదరుడు ఇబ్రహీం అత్తర్ ఉన్నట్టు తెలుస్తోంది.


 అఫ్గానిస్థాన్‌ నుంచి దాదాపు 150 మంది పాకిస్థానీ ఉగ్రవాదులను ఇప్పటికే రావల్పిండికి తరలించారట. ఒక్కో బృందంలో 5-6 మంది చొప్పున 25-30 బృందాలుగా విడిపోయి వారు భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని భావిస్తున్నారు. బక్రీద్ నుంచి ఆగస్టు 15 మధ్య జమ్మూకశ్మీర్‌లో ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైసెస్‌ (ఐఈడీలు)తో పేలుళ్లకు తీవ్రవాదులు ప్రణాళికలు రచించారట.. దీంతో అప్రమత్తమైన భారత సర్కారు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది.