Friday, December 13, 2019
Follow Us on :

కొత్త నిబంధ‌న‌: పెళ్లి కాని అమ్మాయిలు సెల్‌ఫోన్ వాడ‌కూడ‌ద‌ట‌!

By BhaaratToday | Published On Jul 17th, 2019

- అమ్మాయిల‌ సెల్‌ఫోన్ వాడ‌కంపై గ్రామ‌స్తుల నిర్ణ‌యం
- త‌ల్లిదండ్రుల అనుమ‌తి లేకుండా పెళ్లి చేసుకుంటే నేర‌మే
- త‌ల్లిదండ్రుల అనుమ‌తి లేనిది పెళ్లి చేసుకుంటే భారీ జ‌రిమానా 
- గుజ‌రాత్‌లోని ఓ గ్రామంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు

సెల్ ఫోన్...నేటి రోజుల్లో మన జీవితంలో ఓ భాగమైపోయింది. అవసరమైతే రెండు రోజులు అన్నం తినకుండా ఉంటారు కానీ...సెల్‌ఫోన్ లేకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. అంతలా సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. అయితే సెల్ ఫోన్ల వల్లే కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అయితే గుజరాత్ లోని ఓ గ్రామం మాత్రం సెల్ ఫోన్లు వాడటం వల్ల సమాజ నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుందని భావించి ఆ గ్రామంలో కొత్త నిబంధ‌న‌లు విధించారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని జలోల్ గ్రామంలో జరిగిన గ్రామ‌స్తుల స‌మావేశంలో గ్రామ పెద్దలు కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ్రామంలో పెళ్లి కానీ అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడడాన్ని నిషేధించారు. పెళ్లికాని అమ్మాయి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం నేరంగా ఉంటుందని, అంతేకాకుండా ఏ ఒక్క అమ్మాయి కూడా వాళ్ల కుటుంబ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా అది నేరంగా పరిగణిస్తామని గ్రామ‌స్తులు తీర్మానించారు. ఇలా అమ్మాయి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయి తండ్రి 1.5లక్షల రూపాయల జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంద‌ని నిర్ణ‌యించారు.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి:
అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహాలలో ఖర్చులను తగ్గించడం గురించి కొన్ని నియమాలు బాగున్నాయి కానీ  టీనేజ్ అమ్మాయిలను మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండ‌టం ఏమిటీ, ఇలాంటి నిషేధం విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు అల్పేష్ చెప్పారు. అయితే ఆ గ్రామ పెద్దలు  అబ్బాయిల గురించి ఒక నియమం చేసి ఉంటే బాగుండేదని, తనది కూడా ప్రేమ వివాహం కాబట్టి  ప్రేమ వివాహాలపై నియమం గురించి తాను ఏమీ మాట్లాడలేనని అల్పేష్ చెప్పుకొచ్చాడు.