Saturday, October 19, 2019
Follow Us on :

ధోని సొంతగడ్డ మీద అడుగుపెట్టగానే

By BhaaratToday | Published On Mar 6th, 2019

ఆస్ట్రేలియా మీద వరుసగా రెండు వన్డేల్లో గెలిచి భారత్ మాంచి జోరు మీద ఉంది. మొదటి మ్యాచ్ హైదరాబాద్ లో.. రెండో మ్యాచ్ నాగ్ పూర్ లో ముగిశాయి.. ఇక మూడో మ్యాచ్ రాంచీలో..! రాంచీ అనగానే గుర్తుకు వచ్చే పేరు ధోని. ఎందుకంటే ధోనికి ఇంత సొంతగడ్డ. మూడో వన్డే రాంచీ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. బుధవారం నాడు ఆస్ట్రేలియా, భారత్ జట్లు రాంచీకి చేరుకున్నాయి. వారికి రాంచీలో ఘన స్వాగతం లభించింది. 

ధోనీ సొంత గడ్డపై వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. ధోని రాగానే ఎయిర్ పోర్టులో సందడి మొదలైంది. భారతజట్టు బస్సు ఎక్కే వరకూ ధోని-ధోని అంటూ అభిమానులు వెంటపడ్డారు. హైదరాబాద్ వన్డేలో అర్ధ శతకం బాదిన ధోని.. నాగ్‌పూర్ వన్డేలో మాత్రం ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డక్‌‌‌గా అవుట్ అయ్యాడు. సొంతగడ్డపై ధోని బాగా ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.