Monday, August 19, 2019
Follow Us on :

ఇదో షాకింగ్.. అంపైర్ ఒక రన్ అదనంగా ఇచ్చాడా..?

By BhaaratToday | Published On Jul 15th, 2019

2019 వరల్డ్ కప్ ఫైనల్.. అలా ఇలా జరగలేదు. ట్విస్ట్ మీద ట్విస్ట్.. టై.. ఆ తర్వాత సూపర్ ఓవర్.. అది కూడా టై..! మామూలు మ్యాచ్ కాదండీ బాబోయ్.. బెస్ట్ ఆఫ్ ఫైనల్ లాగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లండ్‌ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే బౌండరీలు ఇంగ్లండ్‌ ఎక్కువగా కొట్టడంతో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 

Image result for dharmasena

ఇక ఒక షాకింగ్ అంశం బయటపడింది. అదేమిటంటే అంపైర్ కుమార ధర్మసేన చేసిన తప్పు..! అదనంగా ఒక పరుగును ఇంగ్లాండ్ కు ఇచ్చేశాడని కివీస్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లాండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో బంతిని మిడ్ వికెట్ దిశగా బెన్‌స్టోక్స్ కొట్టాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు.. భారీగా డైవ్ చేశాడు. ఆలా చేసిన సమయంలో కీపర్‌ ఎండ్‌ వైపు బంతి గప్తిల్ త్రో చేయగా బెన్‌స్టోక్స్ బ్యాట్‌‌కి తాకి బౌండరీ‌కి వెళ్లిపోయింది. అదే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. వెంటనే అంపైర్ కుమార ధర్మసేన 2+4 (ఓవర్‌ త్రో) ఆరు పరుగులు ఇంగ్లాండ్ కు ఇచ్చాడు. ఆ తర్వాత టై అయిపోవడం కూడా తెలిసిందే..! ఐసీసీ 19.8 క్లాజ్‌ ప్రకారం బెన్‌స్టోక్స్ రెండో పరుగు పూర్తి చేయకముందే ఓవర్‌త్రో విసిరారు కాబట్టి.. ఆ రెండో పరుగుని ఇవ్వకుండా.. కేవలం ఒక్క పరుగే ఇచ్చి.. ఓవర్ త్రో కి వచ్చిన 4 పరుగులు ఇచ్చేసి ఉండి ఉంటే బాగున్ను అని అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రకారం అయిదే ఇచ్చినా.. ఒక్క పరుగు తేడాతో కివీస్ గెలిచి ఉండేదేమో..! ఇక మనం మాట్లాడుకొని ఏమీ లాభం లేదు.. ఆంగ్లేయులు వరల్డ్ కప్ ను సాధించేశారు. 

Image result for ben stokes overthrow

Image result for dharmasena

Image result for dharmasena