Monday, December 16, 2019
Follow Us on :

బీజేపీలోకి 'ధోనీ' !

By BhaaratToday | Published On Jul 14th, 2019

ప్రపంచ కప్‌లో భారత్‌ కథ సెమీస్‌తో ముగియడంతో ఇప్పుడు చర్చంతా సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్ పైనే జరుగుతోంది. మహీ రిటైర్మెంట్‌ తీసుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రిటైర్మెంట్‌ అనంతరం నరేంద్ర మోదీ టీమ్‌లో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం ఉందంటున్నారు కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్.

క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ నిష్క్రమించడంతో ధోనీ రిటైర్మెంట్ పైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ ఏం చేస్తారు..? ఇదే ఇప్పుడు మహీ అభిమానుల మదిలో తొలిచేస్తున్న ప్రశ్న. అయితే రిటైర్మెంట్‌ అనంతరం ధోనీ బీజేపీ పార్టీలో చేరుతారని ఆయన సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సంజయ్‌ పాస్వాన్‌ తెలిపారు. 

మరోవైపు.. ఇంతకు ముందు చాలా మంది క్రికెటర్లు రిటైర్ అయ్యాక వెంటనే పాలటిక్స్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, అజరుద్దీన్, తాజాగా ఎంపీ గౌతం గంభీర్ ఉన్నారు. ఈ కోవాలోకే జార్ఖండ్ డైనమైట్ కూడా చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ధోనీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

ఇక ఈ ఏడాది చివరిలో జార్ఖండ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపే ధోనీని బీజేపీలో చేర్పించుకుని ఆయన్నే జార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. ధోనీకి మెరుగైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ ధోనీ కమలం పార్టీ కండువా కప్పుకుంటే బీజేపీ తిరిగి అధికారంలోకి సునాయాసంగా వస్తుందనే నమ్మకం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాగా, లోక్‌ సభ ఎన్నికలకు ముందు ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా ధోనీని బీజేపీ చీఫ్‌ అమిత్‌షా కలిసిన సంగతి తెలిసిందే.