Thursday, August 22, 2019
Follow Us on :

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కీల‌క బాధ్య‌త‌లు

By BhaaratToday | Published On Jul 19th, 2019

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) ఛైర్మన్‌గా ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌‌ నియమితులయ్యారు. తిరుపతిలో జరిగిన ఎస్‌వీబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఆయన ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి టీటీడీ పీఆర్‌ఓ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. పృథ్వీ నియామకంపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదిలావుంటే.. ఎస్‌వీబీసీ ఛైర్మన్‌ పదవికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సినిమా ఇండ‌స్ట్రీకే చెందిన‌ పృథ్వీని నియమించారు.