Saturday, December 14, 2019
Follow Us on :

తిరుమలకు వెళుతున్నారా.. ఇది తెలుసుకొని అక్కడి హోటల్స్ లో అడుగుపెట్టండి

By BhaaratToday | Published On Aug 3rd, 2019

తిరుమలలో అన్నప్రసాదాలను టీటీడీనే ఉచితంగా అందిస్తుంది. అయితే బయట హోటళ్లలో తినాలనుకుంటే మాత్రం పర్సులు ఖాళీ అవుతూ ఉంటాయి. తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర మొదలయ్యే అంగళ్లలో ఏ స్థాయి ధరలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పడితే అంత అధికంగా వసూలు చేస్తూ ఉంటారు. ఇక కొండ మీద కూడా హోటళ్లలో భారీ ధరకే అమ్ముతూ ఉంటారు.  

ఈ దోపిడీలపై దేవాదాయ శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని అడ్డుకోవాలని రెడీ అయ్యింది యంత్రాంగం. కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది. దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సంతోషిస్తున్నారు.