Saturday, December 14, 2019
Follow Us on :

మొన్నేమో అన్యమత ప్రచారం.. ఇప్పుడేమో ట్రెజరీ నుంచి కిరీటం, ఉంగరాలు మాయం

By BhaaratToday | Published On Aug 27th, 2019

కొద్ది రోజుల క్రితం తిరుమలకు వెళ్లే బస్సులో అన్యమత ప్రచారం జరిగిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఏకంగా టీటీడీ ట్రెజరీ నుంచి కిరీటం, ఉంగరాలు మాయమవడం తీవ్ర దుమారం రేపుతోంది. 


టీటీడీ ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు. 
ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని కొందరు అంటున్నారు. ఈ ఘటనకు కారకులు ఎవరో తెలుసుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడం సరికాదంటున్నారు.