Monday, August 19, 2019
Follow Us on :

తిరుమ‌ల‌లో కొత్త ప‌ద్ద‌తి..సీఎం ఆదేశాల మేర‌కే ఈ నిర్ణ‌యం

By BhaaratToday | Published On Jul 18th, 2019

తిరుమల కొండపై వీఐపీ బ్రేకు దర్శనాలకు ఇప్పటిదాకా అనుసరించిన ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 విధానం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ విధానాన్ని ఇక ముందు కొనసాగించబోమని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం తిరుమ‌ల‌ కొండపై ప్రకటించారు. ఆ వెంటనే ఆయ న ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్‌లోని ఎల్‌1, 2, 3 అనే విభజనను రద్దుచేసి, అంత‌కు ముందున్న‌ప్రొటోకాల్‌, సాధారణ వీఐపీ బ్రేక్‌ విధానాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తక్షణం అ మల్లోకి తీసుకువచ్చారు. తొలుత సాఫ్ట్‌వేర్‌లో మా ర్పులు తీసుకురావటానికి కొంత సమయం పడుతుందని, రెండు మూడురోజుల్లో అమలు చేస్తామని మీడియాకు చెప్పిన‌ప్ప‌టికీ, బుధవారం నుంచే నూతన విధానం అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎంబీసీ కౌంటర్‌లో ఇచ్చే వీఐపీ బ్రేక్‌ టికెట్లపై ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 అని ముద్రించే విధానాన్ని రద్దు చేశారు. ‘సీఎం ఆదేశాల మేరకు సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. ప్రస్తుత విధానంలో గతంలో దళారీ వ్యవస్థ నడిచింది. ఆ వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతాం’ అని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రొటోకాల్‌ వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిలాగే బ్రేక్‌ను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం మూడు గంటల సమయం తీసుకుంటున్న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను.. గంట, గంటన్నరకు కుదించాలన్నదే తమ లక్ష్యమన్నారు.