Tuesday, May 21, 2019
Follow Us on :

రెండు సినిమాల‌కు ఒకే టైటిల్‌...‘హీరో’కు క‌ష్టాలు

By BhaaratToday | Published On Mar 14th, 2019

విజయ్‌ దేవరకొండతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘హీరో’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెర‌కెక్కిస్తున్నారు. ఏప్రిల్‌ 22న న్యూఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి టైటిల్ చిక్కులు వచ్చిపడ్డాయి. తమిళంలో ‘హీరో’ టైటిల్ తో శివకార్తికేయన్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవర కొండ సినిమా కూడా తమిళంలో హీరో టైటిల్ తోనే విడుదల కాబోతుంది. ఇక రెండు సినిమాలకు ఒకే టైటిల్ పెట్టడంతో సమస్య ఏర్పడింది. మరి ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే రెండు సినిమా టీంల్లో ఏదో ఒక టీం టైటిల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏ టీం తమ టైటిల్ మారుస్తుందో వేచి చూడాలి.