Wednesday, October 16, 2019
Follow Us on :

సత్యం, అహింస అనే ఆయధాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన మ‌హాత్ముడు

By BhaaratToday | Published On Jan 30th, 2019

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ తరపున నాయకత్వం వహించి స్వాతంత్ర్య పోరాటం చేశారు.భారత దేశ చరిత్రలో 1948 జనవరి 30న ఎ తో విషాదదినం. ఈ రోజు మహాత్మునిగా ప్రజల హృదయాలలో కొలువైన మహాత్మగాంధీ కన్నుమూశారు. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు.. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్న మాటలివి. గాంధీజీ జీవితం గురించి చదివినవారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. సత్యం, అహింస అనే ఆయధాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన హాత్ముడాయన. అందుకే గాంధీయిజం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పాఠమైంది. ఆ మహానుభావుడు మనకు ‘జాతిపిత’ అయ్యారు. 

20వ‌ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడు మహాత్మా గాంధీ. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటారు.. సత్యాగ్రహం, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. 

భారతదేశంపై చెరగని ముద్ర వేసిన గాంధీజీ.. 1948 జనవరి 30న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయణ్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మంగళవారం (జనవరి 30) ఆయన 71వ వర్ధంతి. బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనదైన గుర్తింపు పొందారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది భారతీయులకు ఎంతో గర్వ కారణం. 

గాంధీజీ గురించి.. 
గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్థానంలో ఒక దివాన్‌గా పచేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి. తల్లిదండ్రుల సంరక్షణలోనే గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కారు. తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘సత్యంతో నా ప్రయోగం (మై ఎక్స్‌పరిమెంట్ విత్ ట్రుత్)’లో స్వయంగా ఆయనే తెలిపారు. గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్ కోట్‌లో, ఉన్నత విద్య కథియవాడ్‌లో పూర్తి చేశారు.