Wednesday, October 16, 2019
Follow Us on :

ప్రముఖ నటుడు డీఎస్ దీక్షితులు ఇక లేరు..!

By BhaaratToday | Published On Feb 18th, 2019

ప్రముఖ నటులు, దర్శకుడు డీఎస్ దీక్షితులు(63) నేడు మృతి చెందారు. ఆయన దర్శకుడిగా కంటే ‘మురారి’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడు సినిమాలో కూడా ఈయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు తదితర చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. జూలై 28, 1956లో జన్మించిన దీక్షితులు రంగస్థల కళలో తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. ఆయన రంగస్థల నటుడిగానూ, అధ్యాపకుడిగానూ తనదైన ఖ్యాతిని గడించారు.

 దీక్షితులు ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా..ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే నాచారం ఆస్పత్రికి తరలించారు. దీక్షితులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు డాక్లర్లు వెల్లడించారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. దీక్షితులు స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.