Friday, July 19, 2019
Follow Us on :

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి...

By BhaaratToday | Published On May 14th, 2019

డ్రగ్స్ కేసు వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపిన విష‌యం తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఉన్న టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ సామాజిక కార్యకర్త ఈ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించగా ఈ షాకింగ్ విషయాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసిందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్లలో 62 మంది పేర్లు లేకపోవడం గమనార్హం. కేసులో 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ  ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చకపోవడం గమనార్హం. అంటే పలువురు సినీ సెలబ్రెటీలకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింద‌న్న‌మాట‌.
 
మొత్తానికి చూస్తే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిట్ తూతూ మంత్రంగానే చార్జిషీట్ల వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రెటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.
 
క్లీన్‌చిట్ ఇచ్చిన వారిలో....
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, శ్యామ్ కే. నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్హీ, నవదీప్, నవపాద ధర్మారావ్(చిన్నా), నటి ఛార్మీ కౌర్, ముమైత్ ఖాన్, రవితేజ, శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్), తనీష్, హీరో, నందుతో పాటు పలువురు ప్రముఖులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.