Monday, September 23, 2019
Follow Us on :

ప్రముఖ సినీ గీత రచయిత శివగణేశ్ కన్నుమూత.. ఎన్నో హిట్ సాంగ్స్ కి లిరిక్స్

By BhaaratToday | Published On Aug 15th, 2019

 ప్రేమికుల రోజు, నరసింహ, జీన్స్, ఒకే ఒక్కడు.. పాటలు తెలుగులో కూడా ఆ రేంజిలో హిట్ అయ్యాయి అంటే ఆయనే కారణం. అద్భుతమైన ట్యూన్స్ కు అంతే గొప్పగా లిరిక్స్ రాసిన ప్రముఖ సినీ గీత రచయిత శివగణేశ్ కన్నుమూశారు. వనస్థలిపురంలో తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శ్రీ సూర్యమూవీస్ సంస్థ అధినేత ఏఎం రత్నంతో కలసి పలు సినిమాలకు పనిచేశారు. శివగణేశ్ తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దాదాపు 1000కి పైగా పాటలు రాశారు.

 ప్రేమికుల రోజు, నరసింహ, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాల మ్యూజిక్ తెలుగులో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమాలన్నిటికీ లిరిక్స్ రైటర్ గా పనిచేసింది ఆయనే..! 

శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు.  హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలిసింది.