Wednesday, October 16, 2019
Follow Us on :

రేప‌టి టీమిండియా మ్యాచ్‌కు వ‌రుణుడు వ‌స్తున్నాడా?

By BhaaratToday | Published On Jun 21st, 2019

ప్రపంచకప్ 2019లో మ్యాచ్‌ల‌కు వర్షం ప్రధాన సమస్యగా మారింది. వ‌ర్షం దెబ్బ‌కి ఇప్పటికే లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. కాగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీం ఇండియా శనివారం పసికూన అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ స్టేడియంలో భారత్ ప్రాక్టీస్ ముగించుకున్న వెంటనే స్టేడియంలో భారీగా వర్షం కురిసింది. దీంతో అఫ్గానిస్థాన్ ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. 

అయితే శుక్రవారం మాత్రం వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో ప్రాక్టీస్ సజావుగా సాగింది. కానీ, ఇంగ్లండ్‌లో వానలు ఎప్పుడు, ఎలా ఉంటాయో ఊహించలేమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భారత్ సులభంగా విజయం సాధించే ఈ మ్యాచ్‌లో రద్దైతే.. సైమీ ఫైనల్స్‌కి ముందు జట్టు రన్ రేట్ పెరగదు. కాబట్టి రేపు వర్షం కురవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.