Saturday, October 19, 2019
Follow Us on :

చైనా వస్తువులను నిషేధించాలి.. దిగుమతి సుంకాన్ని ఆ స్థాయిలో పెంచితేనే

By BhaaratToday | Published On Aug 20th, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం పాకిస్థాన్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అదే పాకిస్థాన్ కు చైనా వత్తాసు పలకడం భారత్ కు నచ్చలేదు. దీంతో పాక్ కు సహాయకారిగా చైనా ఉండటంతో మన దేశంలోకి  చైనీస్ వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేదించాలి అని సి.ఏ.ఐ.టి.(కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్)  పిలుపినిచ్చింది.

 ట్రేడర్ బాడీ ఆగస్ట్ 29 వ తేదీన అన్ని రాష్ట్రాల ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించింది. అంతే కాకుండా చైనీస్ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు సుంకాన్ని 300 నుంచి 500 శాతం వరకు పెంచాలి అని కూడా నిర్ణయించింది. 
చాలా రోజులుగా చైనా పాకిస్థాన్ కి ప్రతి విషయంలోనూ తన మద్దతు తెలుపుతూ ఉండటంతో ఇలా చేస్తే కానీ బుద్ధి వచ్చేలా కనిపించడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.