Thursday, April 25, 2019
Follow Us on :

ట్రాఫిక్ పోలీసుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఎందుకంటే..?

By BhaaratToday | Published On Mar 21st, 2019

హీరో అంటే పడిచచ్చే ఫ్యాన్స్.. తెరపై ఏం చేస్తాడో.. అభిమానులు రియల్ గా అనుసరించేస్తారు. అభిమానం అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ అయిపోయాడు. గీతగోవిందం తర్వాత యూత్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ హవా కొన‌సాగించేస్తున్నాడు. ఇటీవలే రౌడీ పేరుతో బ్రాండ్ ఇమేజ్ వేసుకున్నాడు. ఈ రౌడీని ఫాలో అయిపోయారు ఫ్యాన్స్ కూడా.

అయితే అస‌లు విష‌యానికొస్తే...ఇద్దరు యువ‌కులు బుల్లెట్ పై వెళుతున్నారు. ఆ బండికి నెంబర్ లేదు. రౌడీ అని రాసి ఉంది. వీరిని చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహ‌నాన్ని ఆపారు. నంబ‌ర్ ప్లేటుపై రౌడీ అని రాసి ఉన్నందుకు జ‌రిమానా విధించారు. ఇదే ఊపులో రౌడీ బండిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ నెంబర్ ప్లేట్ ను నిబంధనలకు అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలి.. అందుకు విరుద్ధంగా ఉంటే సీఎంవీ రూల్స్‌ 50 & 51 కింద జరిమానా విధించటం జరుగుతుంది. దీనిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తాం అని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

నెంబర్ ప్లేట్ పై రాసి ఉన్న రౌడీ.. విజయ్ దేవరకొండ బ్రాండ్. ఈ విషయం తెలుసుకున్న హీరో స్పందించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో వాళ్ల తరఫున నేను సారీ చెబుతున్నా.. ఇలాంటి పనులు చేయకుండా అందరిలో చైతన్యం తీసుకొస్తా.. ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలిసేలా నా వంతు కృషి చేస్తాను. ఈ కుర్రోళ్ల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను అని పోస్టు చేశాడు. హీరో విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పటం సోషల్ మీడియాలో మ‌రింత వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ అంటే ఇంత ప్ర‌మానా..? అని అంటున్నారు. వాళ్లు తప్పు చేస్తే.. హీరో బహిరంగంగా క్షమాపణలు కోరటం ఇదే మొద‌టిసారి. యూత్ ఐకాన్ దేవరకొండ ఇమేజ్ మరో మెట్టు పెరిగింది అంటున్నారు.