Tuesday, October 15, 2019
Follow Us on :

శబరిమల వివాదంలో కొత్త కోణం..! మాటమార్చిన ట్రావెన్ కోర్..!!

By BhaaratToday | Published On Feb 6th, 2019

శబరిమల కేసులో ట్రావెన్ కోర్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తామని ట్రావెన్ కోర్ స్పష్టం చేసింది. అయితే శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీజేఐ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఆర్‌ఎఫ్ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం మహిళలకు శబరిమల ప్రవేశం కల్పించడం లేదని, ఇది అంటరానితనం కిందికి రాదని నాయర్ సర్వీస్‌ సొసైటీ తరఫున వాదనలు వినిపిస్తోన్న కె. పరాశరణ్‌ ధర్మాసనానికి వెల్లడించారు.  ‘శతాబ్దాలుగా ఆలయ సంప్రదాయాలు మార్చాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత వర్గం నిర్ణయిస్తుంది. కొందరు ఉద్యమకారులు దాన్ని నిర్ణయించలేరు. కొన్ని ఆచారాలను రూపు మాపడానికి ఇంతవరకు ఎటువంటి చట్టపరమైన శిక్షలు లేని పక్షంలో కోర్టు ఈ అంశంలో తలదూర్చకూడదు’ అని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నేఫడే ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చేస్తామని.. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తామని ట్రావెన్ కోర్ బోర్డు తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.