Monday, November 18, 2019
Follow Us on :

మంచు మనోజ్ ను వదిలిపెట్టని నెటిజన్లు.. ఆ రోజు అన్న మాటలను పట్టుకుని

By BhaaratToday | Published On Oct 19th, 2019

కొద్దిరోజుల క్రితం మంచు మనోజ్ తన వివాహ బంధం గురించి ఎమోషనల్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రణతి రెడ్డితో తన బంధం ఇక కొనసాగడం లేదని.. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు మనోజ్. తమ  బంధానికి ముగింపు పలికామని.. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని.. వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామని తెలిపాడు మనోజ్. ఎంతో వేదన తర్వాత ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకున్నామని చెప్పాడు ఈయన. విడిపోయినా కూడా ఇద్దరం ఒకరిని ఒకరం ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉంటామని.. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని.. అలాగే తమ వ్యక్తిగత జీవితానికి ప్రైవసీ ఇస్తారని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.    

ఇద్దరి మధ్య మనస్పర్ధలుతలెత్తడంతో ఇద్దరూ కలిసి జీవించడం లేదని గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అలాగే ప్రణతి అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. ఇలా వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరికి విడాకులకు దారి తీసింది. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి వాటిని ఖండిస్తూ మంచు మనోజ్ కొన్ని ట్వీట్స్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్స్ ను కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతేకాకుండా మంచు మనోజ్ గతంలో అన్న మాటలను పట్టుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది చాలా తప్పు ఒకరి పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఊహించడం ఎవరి వలనా కుదరదు. కాబట్టి ఇలాంటి ట్రోల్స్ నెటిజన్లు తగ్గించుకుంటే బాగుంటుంది. 

Image