Monday, September 23, 2019
Follow Us on :

ఆ మాట చెప్పడంతో.. నిర్మల సీతారామన్ పై ఫుల్ ట్రోలింగ్

By BhaaratToday | Published On Sep 11th, 2019

ఇటీవలి కాలంలో భారత్ లో వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ ఓలా, ఉబెర్ వంటి వాటి వలనే భారత్ లో వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయని చెప్పారు.   

ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లను ఆశ్రయిస్తూ, కొత్త వాహనాలు కొనేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో వాహన రంగం మందగమనంలో సాగుతోందని నరేంద్ర మోదీ 100 రోజుల పాలన ముగింపు సందర్భంగా నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మెట్రో రైళ్లను, క్యాబ్ లను ఆశ్రయిస్తోందని తెలిపారు. నెలనెలా ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని భాయపడుతున్న యూత్, సొంత కార్లను కొనడం లేదని అన్నారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఆటో మొబైల్ రంగం ఎలా మెరుగుపర్చాలో ఓ ఆర్థిక మంత్రి ఆలోచించాలి కానీ ఇలాంటి సాకులు చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.