
శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం ద్వారాలు నేడు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే..! శనివారం రోజున మండల పూజ జరగనుంది.. వేలాది మంది అయ్యప్ప భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే మహిళల ఎంట్రీపై ఇంకా ఎటువంటి నిర్ణయం రావడం లేదు. శబరిమల వంటి పుణ్యక్షేత్రంలో శాంతిని కోరుకుంటున్నామని, అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు తమ ప్రభుత్వం పోలీసు ప్రొటక్షన్ ఇవ్వబోదని మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు.
అయితే మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ నవంబర్ 20వ తేదీన శబరిమల ఆలయంకు వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ ఇవ్వలేదని, మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చని ఆమె అన్నారు. తనతో పాటు మరికొందరిని తీసుకు వెళ్తానని చెప్పారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వకున్నా తాను రావడం మాత్రం పక్కా అని ఆమె చెబుతున్నారు.