Monday, September 23, 2019
Follow Us on :

పెండింగ్ చలానాలు కట్టకుంటే రెట్టింపవుతాయంటూ మెసేజ్.. ఇంతకూ నిజమెంత

By BhaaratToday | Published On Aug 27th, 2019

పెండింగ్ చలానాలు చాలా మంది వాహనదారులపై ఉంటాయి. అయితే డబ్బులు వచ్చాక కడదామని ఎదురుచూసే వాళ్ళు ఉంటారు.. తర్వాత ఎప్పుడైనా కడదామనుకునే వాళ్ళు కూడా మరికొందరు ఉంటారు. అయితే పెండింగ్ చలానాలు కట్టకుంటే రెట్టింపవుతాయంటూ ఇటీవలి కాలంలో మెసేజ్ వైరల్ అయ్యింది. అయితే అది మొత్తం అబద్దమే..! 

ఈ ఫేక్ న్యూస్ ను కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మీ వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలానాలు 31-08-2019 లోపు చెల్లించండి. లేనిచో 01-09-2019 నుంచి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయిన వెంటనే పాత జరిమానాలు అన్ని అటోమెటిక్‌గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడును. అంటూ వచ్చిన మెసేజీలో ఏ మాత్రం నిజం లేదు. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ధృవీకరించారు. ఇదంతా తప్పుడు వార్తలని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పడిన చలానాలకు మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. పాత జరిమానా అదే విధంగా ఉండనుంది.