Tuesday, October 15, 2019
Follow Us on :

రైతుబంధు ఒకే..! మరి కౌలు రైతుల పరిస్థితేంటి..?

By BhaaratToday | Published On Feb 1st, 2019

ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం.. రైతులకు తాయిలాలు ప్రకటించింది. రైతు సంక్షేమం కోసం మోడీ సర్కార్ బడ్జెట్లో.. రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 5ఎకరాలు లేదా అంతలోపు భూమి ఉన్న వారికి వరాల జల్లు ప్రకటించింది. ఎన్నికలకు ముందు రైతులకు వరాలు ప్రకటించింది మోడీ ప్రభుత్వం. తెలంగాణలో అమలువుతున్న రైతుబంధు పథకంను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభమైన రైతు బంధు పథకంతోనే తిరిగి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇదే ఫార్ములాను ఒడిసి పట్టుకున్నట్లున్నారు ప్రధాని మోడీ. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఐదెకరాల లోపు ఉంటే ఏడాదికి 6వేల రూపాయలు ఇవ్వనున్నారు.  ఇక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 75వేల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దీంతో 12కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అది కూడా మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు. అంటే వాయిదాకు 2వేల రూపాయలు చెల్లిస్తారు. చిన్న సన్నకారు రైతులకు మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతోనే.. ఈ పథకం తీసుకొచ్చినట్లు ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లోకి వెళుతుంది. అయితే కేంద్రం ప్రకటించిన పథకంలో కూడా స్పష్టత రాలేదు. ఇక కేసీఆర్‌కు దక్కిన క్రెడిట్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకంలో.. భూమి తమ పేర్లపై ఉన్న ప్రతిఒక్కరికీ ఎకరాకు 8వేల రూపాయలు ఇస్తోంది. అయితే ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మరో 2వేలు పెంచి దాన్ని రూ. 10వేలు చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. ఇక రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.  మొత్తానికి కేంద్రం రైతు సంక్షేమం కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు చేయడంపై.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే మరి కౌలు రైతుల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకంగా మారింది.