Monday, November 18, 2019
Follow Us on :

నటి, టీవీ యాంకర్ ప్రశాంతి ఇలా చేసిందేమిటి

By BhaaratToday | Published On Apr 22nd, 2019

ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ముగ్గురు అమ్మాయిలు పెద్ద రచ్చ చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు ఒక వ్యక్తిని మ్యాచ్ చూడకుండా ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. భారత ఫైనాన్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్‌ ఉపాధ్యాయ్‌ ఫిర్యాదు చేశారు. 

Image result for anchor prasanthi

అయితే తీరా చూస్తే ఆ రచ్చ చేసిన వాళ్ళు యాంకర్ ప్రశాంతి.. ఆమె స్నేహితులు అని తర్వాత తెలిసింది. ప్రశాంతి, మరో ఐదుగురు తనను హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైజర్స్ మ్యాచ్ చూడకుండా అడ్డుకున్నారని, తనను దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని సంతోష్‌ ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు. తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు. సీసీ టీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. నటిగా, యాంకర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంతి ఇలా చేసిందేమిటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.