Thursday, September 19, 2019
Follow Us on :

అంబేద్కర్ విగ్రహం తరలింపు కేసులో ఇద్దరు అరెస్ట్

By BhaaratToday | Published On Apr 14th, 2019

అంబేద్కర్ విగ్రహం తరలింపు కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు, జేసీబీ ఆపరేటర్ గుప్తను జవహర్ నగర్ పోలీసు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి తొలగించిన విగ్రహాన్ని సురక్షితంగా తరలించకుండా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు డంపింగ్‌ లారీలో తీసుకెళ్లారు. ఈ క్రమంలో విగ్రహం ముక్కలైందని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అనుమతి లేకుండా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది శనివారం దానిని తొలగించడం జరిగింది.విగ్రహం తరలింపు వివాదాస్పదమైంది. అంబేద్కర్‌ విగ్రహ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో బాబా సాహెబ్‌ విగ్రహాన్ని చేయించి.. పంజాగుట్ట చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి దిమ్మెను నిర్మించి దీనిపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిని అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ జీహెచ్‌ఎంసీ కిందిస్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తెల్లవారుజామున పంజాగుట్ట పోలీసుల సహకారంతో వారు ఆ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేశారు.