Thursday, September 19, 2019
Follow Us on :

తిట్టడం లేదు, కొట్టడం లేదు.. నా భర్త అతిగా ప్రేమించేస్తున్నాడు.. విడాకులు కావాలి

By BhaaratToday | Published On Aug 23rd, 2019

భర్త సరిగా చూసుకోవడం లేదని.. చితక్కొడుతున్నాడని చెప్పి విడాకుల కోసం అప్లై చేసే వాళ్ళే చాలా ఎక్కువ..! అంతెందుకు చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు కోరుకుంటున్న సమాజం ఇది..! అలాంటిది తన భర్త అమితంగా ప్రేమను కురిపిస్తున్నాడని.. తన మీద కనీసం అరవడం లేదని ఓ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చోటుచేసుకుంది. 

అబుదాబీకి చెందిన ఈ భార్యాభర్తల స్టోరీ అందరికీ చాలా వింతగా అనిపిస్తోంది. వారిద్దరూ పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఆమె భర్త ఒక్కసారి కూడా ఆమెను తిట్టలేదంట.. ఆమె చేసే ఏ పనిలో అయినా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడట. ఇన్నాళ్లుగా తన మీద ఒక్కసారి కూడా అరవలేదని.. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడని.. తనకు కూడా తన భర్తతో గొడవపడాలని ఉందని.. కానీ భర్త తన తప్పులను క్షమిస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడని ఆమె షరియా చట్టం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. 

అయితే దీనిపై ఆమె భర్త మాట్లాడుతూ తాను తన భార్యను చాలా ప్రేమిస్తూ ఉన్నానని.. ఎందుకో తన భార్య ఏమి తప్పు చేసినా క్షమించగలుగుతున్నానని.. పర్ఫెక్ట్ హస్బెండ్ లా ఉండాలని తాను అనుకున్నానని.. అలాగే తన భార్యను చూసుకున్నానని, ఎటువంటి తప్పు కూడా తాను చేయలేదని అన్నాడు. అలాగే తన భార్య విడాకుల దరఖాస్తును వెనక్కు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నాడు. కోర్టు ఈ కేసును వాయిదా వేయడమే కాకుండా సెటిల్మెంట్ చేసుకోమని సలహా కూడా ఇచ్చింది.