Sunday, August 25, 2019
Follow Us on :

రాజద్రోహానికి పాల్పడే వారిని ఉరి తీయాలి.. మీరు అంగీకరిస్తారా?

By BhaaratToday | Published On Apr 8th, 2019

శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే తమ పార్టీ అభ్యర్థి తరఫున సోమవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశ ద్రోహులకు మద్దతిస్తున్న రాహుల్‌ గాంధీని అధికారంలోకి రానివ్వొద్దని.. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని పేర్కొన్నారని.. దీన్ని మీరు అంగీకరిస్తారా’ అని ప్రజలను ప్రశ్నించారు. రాజద్రోహానికి పాల్పడే వారిని ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘దేశం మీద ప్రేమతో శివసేన, బీజేపీ, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఒక కూటమిగా ఏర్పడ్డామని.. మరి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి లక్ష్యం ఏంటని.. మేం దేశం కోసం కలలు కంటాం. మరి మీ కల ఏంట’ని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అధికారాన్ని దక్కించుకోవడమే మీ ధ్యేయం అంటూ విమర్శించారు. రేపు కూడా మా ప్రధాని నరేంద్ర మోదీనే.. మరి మీ ప్రధాని ఎవరో చెప్పగలరా అంటూ ఆయన ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు.