Thursday, September 19, 2019
Follow Us on :

ప్రియాంక చోప్రాపై ఫిర్యాదు.. పాక్ నోరు మూయించిన ఐక్యరాజ్యసమితి

By BhaaratToday | Published On Aug 23rd, 2019

భారత్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారత్ ను ఇరుకున పెట్టాలని.. భారత్ కు చెందిన సెలెబ్రిటీలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పాకిస్థాన్  అధికారులు ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక చోప్రాకు వ్యతిరేకంగా లేఖ రాశారు.   

కొన్నినెలల కిందట సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినప్పుడు ప్రియాంక 'జైహింద్' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై కక్షగట్టిన పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాశారు. ‘జమ్మూకశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు’ అని లేఖలో ఫిర్యాదు చేశారు. 

దీనిపై ఐక్యరాజ్యసమితి పాక్ కు సమాధానం ఇచ్చింది. గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని, తాము ఆందోళన చెందే అంశాలపై నిర్భీతిగా మాట్లాడవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరాస్ వెల్లడించారు. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆమె యూనిసెఫ్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం పరిగణనలోకి తీసుకునేవాళ్లమని గుటెరాస్ స్పష్టం చేశారు. 
 ప్రియాంక చోప్రాను ఇటీవల ఓ పాకిస్థాన్ మహిళ.. ‘భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉంటూ ఇలా చేయకూడదు అని అడిగింది. దీనికి ప్రియాంక సరైన సమాధానం ఇచ్చింది. పాక్ లో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా అంటూ సరైన సమాధానం చెప్పడంతో ఆ పాకిస్థానీ మహిళ నోరుమూసుకుంది.