Thursday, September 19, 2019
Follow Us on :

బైక్ పై భార్యాభర్తలు..పోలీసులు ఓవర్ టేక్ చేయకుంటే వారి ప్రాణాలు..?

By BhaaratToday | Published On Apr 15th, 2019

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ కుటుంబానికి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఏమి జరిగిందంటే.. ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే మీద TVS Apache RTR బైక్ మీద ఓ కుటుంబం వెళుతోంది. అయితే కింద బైక్ కు మంటలు చెలరేగడం వారు గమనించలేదు. బైక్ మరీ వేగంతో వెళ్ళసాగింది.. మంటలు కూడా వేగంగా వ్యాపించాయి. అయితే పోలీస్ కంట్రోల్ రూమ్(పిసిఆర్) వ్యాన్ ఆ హైవే పైనే వెళుతోంది. ఇలా మంటలు అంటుకున్న విషయాన్ని ఆ బైక్ మీద వెళుతున్న వారికి తెలియజేయడానికి చాలా దూరం వెంబడించారు. చివరికి ఆ బైక్ ను ఓవర్ టేక్ చేసి ఆపేసి.. బైక్ కు ఉన్న మంటలను ఆర్పేశారు.   

 

ఆ బైక్ కు మంటలు అంటుకున్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే సైరన్ వేసుకుంటూ వచ్చారు. కార్ లోపలి నుండే బైక్ మీద వెళుతున్న వారికి విషయం చేరేలా అరవడం మొదలుపెట్టారు పోలీసులు. ఓవర్ టేక్ చేసి బైక్ కు ఉన్న మంటలను ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను ఉపయోగించారు. బైక్ కు ఉన్న లగేజ్ మొత్తాన్ని తీసేసి మంటలను అదుపు చేశారు పోలీసులు. ఎటువంటి నష్టం కలుగకుండా పోలీసులు చేసిన ఈ పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.   

Image result for UP police save lives

Image result for UP police save lives

Apache Fire Featured