Wednesday, October 16, 2019
Follow Us on :

ఉప్పల్ వన్డేకు భారీ భద్రత... ఈ వస్తువులుంటే స్టేడియంలోకి నో ఎంట్రీ

By BhaaratToday | Published On Mar 2nd, 2019

పుల్వామా ఉగ్రదాడి ప్రభావం యావత్ భారతదేశంపై పడింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోవడం, యుద్ధం వచ్చే ఛాయలు కనిపిస్తూ ఉండడంతో హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మార్చి 2న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే ఈ డే-నైట్ మ్యాచ్‌‌కు దాదాపు 2,300 మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. స్టేడియంలో పరిధిలో అడుగడుగున పటిష్ట నిఘా కోసం 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్టేడియంలో సెల్‌ఫోన్లు, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు నిషేధమని తెలిపారు. కెమెరాలు, బ్యానర్లు, ల్యాప్‌టాప్‌లు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, పదునైన పరికరాలు, బైనాక్యులర్, కాయిన్లు, బ్యాటరీలు, హెల్మెట్స్, బ్యాగ్స్... స్టేడియంలోపలికి తీసుకెళ్లడానికి వీలు లేదని సూచించారు పోలీస్ కమీషనర్.