Monday, September 23, 2019
Follow Us on :

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఊర్మిళ

By BhaaratToday | Published On Sep 10th, 2019

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న సంగతి తెలిసిందే..! అయితే మంగళవారం నాడు ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆమె ముంబై నార్త్ నుండి పోటీ చేశారు.. కానీ గెలవలేకపోయారు. కేవలం ఆరంటే.. ఆరు నెలలు మాత్రమే ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగారు.