Tuesday, June 18, 2019
Follow Us on :

భారీ రోడ్డు ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ మెగా హీరో

By BhaaratToday | Published On Jun 12th, 2019

మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోటకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.
 
అయితే రోడ్డుప్రమాదంపై వరుణ్ తేజ్ స్పందించారు. ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అందరం సురక్షితం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నాపై మీ ప్రేమాభిమానాలు చూపించినందుకు ధన్యవాదాలు.’’ అని సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్ తెలిపారు.
 
కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘‘వాల్మీకి’’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ నిమిత్తం యాగంటికి వెళ్తుండగా.. కొందరు యువకులు వరుణ్ కారును ఢీకొట్టారు. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో వరుణ్‌కు ప్రమాదం తప్పింది. అయితే మరో కారులో ఆయన అక్కడ నుంచి షూటింగ్‌కు వెళ్లిపోయారు.