Tuesday, June 18, 2019
Follow Us on :

ఓ వైపు తుఫాను.. మరో వైపు హారతి కొనసాగుతుంది

By BhaaratToday | Published On Jun 13th, 2019

అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుపాను కారణంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావం ప్రఖ్యాత సోమనాథ్ ఆలయంపై కూడా పడింది.  ప్రవేశద్వారం కుప్పకూలగా, అక్కడి షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. 

Somnath BHu

పెను తుఫాను నేపథ్యంలో దేవాలయాలను మూసివేయాలని, సముద్రతీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అయితే  సోమనాథ్ దేవాలయంలో కొన్నేళ్లుగా హారతి కొనసాగుతుందని, తుఫాను కారణంగా దేవాయాలయాన్ని మూసివేసేది లేదని గుజరాత్ రాష్ట్ర మంత్రి భూపేంద్ర సిన్హ్ చెప్పారు. దేవాలయం తెరచి ఉంచినా, తుపాన్ వల్ల భక్తులు మాత్రం దేవాలయ సందర్శనకు రావద్దని మంత్రి భూపేంద్ర సిన్హ్ కోరారు. 

ప్రస్తుతం గుజరాత్ కు 140 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.  ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో తుఫాను ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.