Friday, July 19, 2019
Follow Us on :

‘మహర్షి’ సినిమా చూసిన వెంక‌య్య‌నాయుడు ఏమ‌న్నాడో తెలుసా..?

By BhaaratToday | Published On May 15th, 2019

మ‌హేష్‌బాబు న‌టించిన ‘మహర్షి’ అద్భుతంగా ఉందంటూ భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కితాబిచ్చారు.తాను 'మహర్షి' సినిమాను కుటుంబ సభ్యులతో కలసి చూశానని, సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ప్ర‌శంసించారు. ఈ సినిమాలో మహేశ్ బాబు నటన ఎంతో సహజంగా ఉందని, మహేశ్ చక్కని నటన కనబరిచారని త‌న ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు వెంక‌య్య‌నాయుడు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ఈ సినిమా గుర్తుకు తెచ్చిందన్నారు. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో రెండు ట్వీట్లు పెట్టారు.

 "గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

 అంతకుముందు, "కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా" అని అన్నారు.