Sunday, August 25, 2019
Follow Us on :

తమ్ముడి సినిమాకు రివ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ

By BhaaratToday | Published On Jul 13th, 2019

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా నటించిన సినిమా దొరసాని. వీరిద్దరూ నటించడం ఇదే తొలిసారి. కొత్త నటీనటులైనా కూడా బాగా చేశారని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా దొరసాని క్యారెక్టర్ చేసిన శివాత్మిక గురించి నెటిజన్లు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది అని క్రిటిక్స్ అంటున్నారు. 

ఇక ఈ సినిమాను చూసిన విజయ్ దేవరకొండ చిత్రానికి సంబంధించి తన ఒపీనియన్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దొరసాని సినిమాను చూసిన విజయ్ దేవరకొండ ఆ చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్స్ చేసాడు. లీడ్ క్యారెక్టర్స్ చేసిన ఇద్దరూ అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చాడు. ఇక తన తమ్ముడు చేసిన రాజు క్యారెక్టర్ ను ఇంకా ప్రేమిస్తున్నానని విజయ్ చెప్పుకొచ్చాడు. అలాగే శివాత్మిక నటన కూడా తనను కదిలించి వేసిందని.. సినిమా లోని ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా ఉందని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. సినిమా టెక్నీషియన్స్ ను కూడా అభినందిస్తూ మరో పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కథ ప్రేక్షకులకు బాగా నచ్చాలని కోరుకుంటున్నానని విజయ్ ఆకాంక్షించాడు.