Friday, March 22, 2019
Follow Us on :

హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేష్

By BhaaratToday | Published On Mar 15th, 2019

ఎంపీగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగానే వివేకా హత్యకు బీజం పడిందని విజయసాయిరెడ్డి అన్నారు. వివేకా హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేష్ లు అయితే.. హత్య కుట్రను అమలు చేసింది ఆదినారాయణరెడ్డి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ కేసు విషయంలో సిట్ పై నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్ కుటుంబాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు విజయ సాయి రెడ్డి. 1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దాంట్లో భాగంగానే వివేకా హత్య కూడా జరిగిందని అన్నారు. ఈ హత్యలో ఆదినారాయణరెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి మనిషి కాదు దుర్మార్గుడు. ఏ మాత్రం విలువల్లేని వ్యక్తి. సరిగ్గా చెప్పాలంటే మనిషి జాతిలో అతడు పుట్టడం పట్ల ప్రతి మనిషి బాధపడాల్సిన విషయం. ఈ హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే, దీన్ని అమలుపరిచింది మాత్రం ఆదినారాయణరెడ్డి. ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో చేయించిన ఘాతుకమేనని విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.