Saturday, August 24, 2019
Follow Us on :

గెలవగానే రోడ్ల మీద సంబరాలు చేసుకున్నారంటే..!

By BhaaratToday | Published On May 20th, 2019

మే 23వ తేదీ కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. తమ.. తమ నేతలు గెలుస్తారంటూ ఎవరికి వారే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రిజల్ట్ అనుకూలంగా రాగానే రోడ్డు మీద సందడి చేసేద్దామని అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆరోజు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ఫుల్ అలర్ట్ అయ్యారు. 
 

లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని.. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, లెక్కింపు కేంద్రం వెలుపల పోలీసుల బలగాలు ఉంటాయని సీపీ వెల్లడించారు. అలాగే లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.