Saturday, October 19, 2019
Follow Us on :

'వినయ విధేయ రామ' మూవీ రివ్యూ

By BhaaratToday | Published On Jan 14th, 2019

జానర్ : యాక్షన్ డ్రామా
న‌టీన‌టులు: రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డీవీవీ దానయ్య

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. కథానాయకుడ్ని ప్రేమించి, అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన. అందుకే అవన్నీ వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. మరి బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు? మ‌రి రామ్‌చ‌ర‌ణ్‌ `విన‌య‌విధేయరామ‌` గా తెర‌పై విన‌య‌, విధేయంగా ఉన్నాడో.. లేక విధ్వంసాన్ని క్రియేట్ చేశాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం..

క‌థ‌:
న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారికి అనుకోకుండా ప్ర‌మాదం ఎదుర‌వుతుంది.వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్ (రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు. భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ కొట్టేస్తాడు. ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌ర‌నీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌
బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా అన‌గానే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. అవి రెండూ అమితంగా ఉన్న సినిమా `విన‌య విధేయ రామ‌`. న‌లుగురు అనాథ‌లు క‌లిసి పెంచుకున్న మ‌రో అనాథ రామ్‌. సొంతంగా ఆసుప‌త్రి ఉన్న డాక్ట‌ర్ వీరికి ఆశ్ర‌య‌మిస్తాడు. కొన్నేళ్ల పాటు న‌లుగురు అన్న‌ద‌మ్ములూ క‌లిసి త‌మ్ముడిని చదివించుకుంటారు. కానీ ఒక సంద‌ర్భంలో త‌మ్ముడు త‌న అన్న‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల‌ని చ‌దివిస్తాడు.ఇక్క‌డ అర్థం కాని పాయింట్ ఏంటంటే... బాల‌ల చేత ప‌నిచేయించుకోవ‌డం చ‌ట్ట‌విరోధం. అందులోనూ వ‌య‌సులో పెద్ద‌వారు చ‌దువుకుంటుంటే, చిన్న పిల్లాడు ఎలా ప‌నులు చేశాడు? బాల‌కార్మిక చ‌ట్టం ఆ డాక్ట‌ర్‌కి గుర్తుకురాలేదా? ఆ ఒక్క‌బ్బాయిని చ‌దివించ‌లేక‌పోయాడా? స‌రే క‌థలో ఏదో కొత్త‌ద‌నం ఉండాలి కాబ‌ట్టి అలా కానిచ్చేశార‌ని అనుకున్నా త‌ర్వాత కూడా ఇలాంటి దృశ్యాలు చాలానే క‌నిపిస్తాయి. బీహార్ ముఖ్య‌మంత్రి ఎవ‌రో సాక్షాత్తు ఐఏయ‌స్ ఆఫీస‌ర్ భార్య‌కు తెలియ‌క‌పోవ‌డం ఏంటి? అన్న ఐఏయ‌స్ అయితే, త‌మ్ముళ్లు ఇద్ద‌రు ఆయ‌న‌తో పాటు ప్ర‌తి చోట‌కూ బ‌దిలీ కావ‌డానికి ఎలా కుదురుతుంది? ఓ సామాన్యుడి కోసం బీహార్ ముఖ్య‌మంత్రి సైనికుల‌తో హైద‌రాబాద్‌కు రావ‌డం సాధ్య‌మైన విష‌య‌మేనా? ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మొత్తం చిత్రంలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. త‌న హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. ముఖేష్‌రుషి ఎపిసోడ్ చివ‌ర‌కు ఏమైందో క్లారిటీ ఉండ‌దు. ప్రీ క్లైమాక్స్ లో స్నేహ‌ను చూస్తే `స‌రైనోడు`లో ర‌కుల్ ప్రీత్‌సింగ్ లుక్‌, ఎమోష‌న్ గుర్తుకొస్తాయి. దేవిశ్రీ పాట‌లు, కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింటే. డైలాగులు బావున్నాయి. `ఉచ్చ‌పోయిస్తా` అని ముఖేష్ రుషి అన్న‌ప్పుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌వ‌ర్త‌న బీసీ సెంట‌ర్ల‌కు క‌నెక్ట్ అవుతుంది.

+ ప్ల‌స్ పాయింట్స్‌:
రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు
నిర్మాణ విలువ‌లు
ఇంట‌ర్వెల్ ఏపిసోడ్‌
యాక్ష‌న్ పార్ట్‌

- మైన‌స్ పాయింట్స్‌:
రొటీన్ క‌థ‌
హింస ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌టం
ఒక‌టి, రెండు పాట‌లు మిన‌హా మిగిలిన పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించేలా లేక‌పోవ‌డం.
లాజిక్స్‌కు మ‌రీ దూరంగా సినిమా ఉండటం.

చివ‌రిగా: విన‌య విధేయ మాస్ రాముడు