Wednesday, October 16, 2019
Follow Us on :

కింగ్ కోహ్లీ.. అవార్డుల హ్యాట్రిక్ కొట్టాడు..!

By BhaaratToday | Published On Jan 22nd, 2019

విరాట్ కోహ్లీ.. ఐసీసీ అవార్డుల్లో హ్యాట్రిక్ కొట్టాడు. 
ఉత్తమ క్రికెటర్ - విరాట్ కోహ్లీ
ఉత్తమ వన్డే క్రికెటర్ - విరాట్ కోహ్లీ
ఉత్తమ టెస్ట్ క్రికెటర్ - విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక సంవత్సరం లో మూడు అవార్డ్స్ గెలుచుకున్న మొదటి క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు కోహ్లీ. 

ప్రతి ఏడాది ఐసీసీ టెస్ట్ క్రికెట్ జట్టును, వన్డే జట్టును ప్రకటిస్తూ ఉంటుంది. ప్రపంచం లోని బెస్ట్ ప్లేయర్స్ ను ఆ లిస్టులో చేరుస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఐసీసీ వన్డే జట్టు, టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ స్థానం సంపాదించాడు. అంతేకాకుండా రెండు ఫార్మాట్లలో కెప్టెన్ గా కూడా మరో మెట్టు ఎక్కాడు. ఇండియా, న్యూజిలాండ్ కు చెందిన చెరో ముగ్గురు ఆటగాళ్లు ఐసీసీ టెస్టు జట్టులో స్థానం సంపాదించారు. ఇండియా, ఇంగ్లాండ్ కు చెందిన నలుగురు ఆటగాళ్లు ఐసీసీ వన్డే క్రికెట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు సంపాదించారు.