Monday, September 23, 2019
Follow Us on :

అగ్రస్థానాన్ని కోల్పోయిన కోహ్లీ..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటిస్థానం దక్కించుకున్నాడు. కోహ్లీ తర్వాత మూడో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 
ఇక బౌలింగ్ విభాగంలో  ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ మొదటి ర్యాంకులో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా ప్రధాన బౌలర్ కగిసో రబాడా రెండోస్థానంలో ఉన్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. 

ఇక విండీస్ తో టెస్టు సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టి20 ఆటగాడిగా ముద్ర పడిన ఓ క్రికెటర్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తుండడం మామూలు విషయం కాదని అన్నాడు. వెస్టిండీస్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన స్పెల్ భయంకరం అని, అలాంటి బౌలింగ్ ను తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని అన్నాడు. బుమ్రా ఫామ్ లో ఉన్నాడంటే తొలి ఐదారు ఓవర్లలోనే సగం పని ఫినిష్ చేసేస్తాడని కోహ్లీ కితాబిచ్చాడు.  బుమ్రా క్రమశిక్షణ, అంకితభావంతో తనను తాను మలుచుకున్నాడని ప్రశంసించాడు.